Header Banner

సూపర్ స్టార్ రిటైర్మెంట్ వార్తలపై ఊహాగానాలు! ఆయన భార్య ఆసక్తికర సమాధానం..

  Mon May 05, 2025 15:34        Entertainment

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల నుంచి తప్పుకోనున్నారనే ఊహాగానాలు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 'కూలీ', 'జైలర్ 2' వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తరుణంలో ఈ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుందని, రజనీకాంత్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నారని సమాచారం. దీనితో పాటు, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రానున్న 'జైలర్ 2' షూటింగ్‌లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఇలా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సమయంలోనే ఆయన రిటైర్మెంట్ వార్తలు తెరపైకి వచ్చాయి.

 

ఇది కూడా చదవండి: బకింగ్‌ హాంలో గుర్రపుడెక్కను తొలగించండి! రైతులకు ఇబ్బందులు కలగకుండా..

 

 ఇటీవల, రజనీకాంత్ నటనకు స్వస్తి పలకనున్నారంటూ కొన్ని ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ వార్తలు ఆయన అభిమానులను కొంత ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో, రజనీకాంత్ అర్ధాంగి లత రజనీకాంత్ తాజాగా ఈ ఊహాగానాలపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లతను మీ భర్త సినిమాల నుంచి విరామం తీసుకునే ఆలోచనలో ఉన్నారా? అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఇందుకు లత బదులిస్తూ, "ఆ ప్రశ్నకు సమాధానం నాకు తెలిస్తే బాగుండేది. తెలిస్తే కచ్చితంగా మీకు చెప్పేదాన్ని" అని అన్నారు. ఆమె నేరుగా సమాధానం ఇవ్వకపోవడంతో, రజనీకాంత్ భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న సందిగ్ధత ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉంది. 

 

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices